Header Banner

హైదరాబాదులో అడుగడుగునా నా కృషి ఉంది - సీఎం చంద్రబాబు! ఇంటింటికీ ఐటీ ఉద్యోగం లక్ష్యం!

  Sat Feb 01, 2025 18:15        Politics

ఏపీ ముఖ్యమంత్రి ఇవాళ అన్నమయ్య జిల్లా మోటకట్లలో పర్యటించారు. గ్రామంలో ఇంటింటికీ తిరిగి సామాజిక పెన్షన్లను స్వయంగా అందించారు. ఓ కార్యక్రమంలో లబ్ధిదారులకు ఎలక్ట్రిక్ ఆటోలను పంపిణీ చేశారు. అనంతరం ఆటోడ్రైవర్లతో ముచ్చటించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మోటకట్ల గ్రామంలో జరిగిన ప్రజావేదిక సభలో ఆయన ప్రసంగిస్తూ... గత ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసిందని, పోలవరం ప్రాజెక్టును గోదావరిలో ముంచేశారని వైసీపీ నాయకత్వంపై మండిపడ్డారు. అభివృద్ధిలో 20 ఏళ్లు వెనక్కి వెళ్లామని విచారం వ్యక్తం చేశారు.


ఇంకా చదవండినామినేటెడ్ పదవులు ఆశించేవారు తప్పనిసరిగా ఇలా చేయాలి... ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు! 


వైసీపీ పాలనలో ప్రజలు ఐదేళ్లు నష్టపోయారని, ప్రజల్లోనూ ఆలోచనా విధానం మారాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక, హైదరాబాదులో అడుగడుగునా తన కృషి ఉందని చంద్రబాబు ఉద్ఘాటించారు. అప్పుడు హైదరాబాదును అభివృద్ధి చేశాం... ఇప్పుడు అమరావతి అభివృద్ధికి నడుం బిగించామని అన్నారు. మూడు రాజధానులు అని మూడు ముక్కలాటతో భ్రష్టుపట్టించారని విమర్శించారు. యువతకు సరైన భవిష్యత్ ను అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, గ్రామీణ ప్రాంతాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేసే సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు మండలాల పరిధిలో టెక్ టవర్లు నిర్మిస్తామని చంద్రబాబు వెల్లడించారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


ప్రతి ఇంట్లో ఒక ఐటీ ఉద్యోగి ఉండాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తుండడం శుభసూచకం అని, ఆరు నెలల్లోనే రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని చెప్పారు. స్వర్ణాంధ్ర-2047 విజన్ తో ముందుకెళుతున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. 2047 నాటికి రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యమని తెలిపారు.


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

టీడీపీ కార్యాలయంలో కోపగించుకున్న లోకేష్! ప్రోటోకాల్ పేరుతో పోలీసుల అత్యుత్సాహం!

 

ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ ఆధ్వర్యంలో చంద్రబాబును కలిసిన ప్రవాస ఆంధ్రులు! కష్టాల్లో ఉన్నామని వచ్చిన వారికి 2.5 లక్షల ఆర్ధిక సహాయం!

 

టాలీవుడ్ లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి! ఎవరంటే!

  

చంద్రబాబు మరో కీలక నిర్ణయం.. ఆ భూములు అన్నీ వారికే ఇక.. ప్రభుత్వం కొత్త చట్టం!

 

భూముల ధరల పెరుగుదలతో కార్యాలయాల్లో భారీ రద్దీ! సర్వర్లు డౌన్ కారణంగా ఆటంకం!

 

దేశంలోనే ఫస్ట్ టైమ్ ఏపీలో.. 'మన మిత్రవాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు!

 

ఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి నుంచి ఆ యూపీఐ పేమెంట్స్ ప‌నిచేయ‌వు.. కార‌ణ‌మిదే!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #hyderabad #development #APCM #CBN #paryatana #todaynews #flashnews #latestupdate